1 May, 2026 | 4:07 AM

నర్మాదాలో పడవ మునక.. నలుగురి మృతి

01-05-2026 01:31 AM
  1.   18 మందిని రక్షించిన ఎస్డీఆర్‌ఎఫ్, పలువురు గల్లంతు
  2. మధ్యప్రదేశ్ జబల్‌ఫూర్ బర్గీ డ్యామ్‌లో ప్రమాదం

భోపాల్, ఏప్రిల్ 30: మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ బర్గీడ్యామ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 30 నుంచి 35 మందితో ప్రయాణిస్తున్న పర్యాటక క్రూయిజ్‌షిప్ మునిగిపోయింది. అందులో ప్రయా ణిస్తున్న వారిలో నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదం గురువారం ఖమారియా ద్వీపం సమీపంలో జరిగింది.

షిప్ బలమైన తుపాను గాలుల కారణంగా మునిగిపోయిందని అధికారులు తెలిపా రు. సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్టీఆర్ ఎఫ్ బృందం 18 మం దిని సురక్షితంగా రక్షించా రు. నలుగురి మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన వారిని కనుగొనేందుకు చ ర్యలు ముమ్మరం చేశారు.  ఘటనకు కారణమైన వారి పై చర్య లు తప్పవని సీఎం మోహ న్ హెచ్చరించారు.