15 August, 2026 | 11:31 AM

ఏజెన్సీలో ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

15-08-2026 10:40 AM

ఉట్నూర్, ఆగస్టు 15(విజయక్రాంతి): ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని  ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ  మండల కేంద్రాలతో పాటు  గ్రామాల్లో  80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను  ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు     గ్రామపంచాయతీ కార్యాలయంలో పాఠశాలలో   జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఉట్నూర్ ఐటిడిఏ కార్యాలయంలో పిఓ మంద మకరందు, ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో రాథోడ్ మోహన్ సింగ్, ఏఎస్పీ కార్యాలయంలో  ఏఎస్పీ  రితిక్ సాయి కొట్టే, తహసిల్దార్  కార్యాలయంలో రఘునాథ్ రావు, ఇంద్రవెల్లిలో  ప్రవీణ్ కుమార్ ల తోపాటు పోలీస్ స్టేషన్లో ఎస్సైలు, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవోలు, సర్పంచులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు.