31 July, 2026 | 6:31 PM

అంబేద్కర్ సంఘం మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

03-09-2025 12:36 AM

అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు ఎంపెల్లి వీరాస్వామి 

ప్రధాన కార్యదర్శిగా బోడ రామచంద్రం

మంగపేట,(విజయక్రాంతి): మండలంలోని తెలంగాణ అంబేద్కర్ సంఘం కమిటీ ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు గా ఎంపెల్లి వీరాస్వామి ప్రధాన కార్యదర్శి గా బోడ రామచంద్రం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ అంబేద్కర్ సంఘం మండల ప్రధాన కార్యదర్శి బసరికాని హరికృష్ణ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయగా ముఖ్య అతిధిగా తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జన్ను నర్సన్న హాజరై మాట్లాడుతూ... భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యతి డా బి ఆర్ అంబేద్కర్ఆ శయాలను సిద్దాంతాలను ముందుకు తీసుకు వెళ్లాలని అంబేద్కర్ సంఘాలను రాష్ట్రము లోని అన్ని గ్రామాలలో బలోపేతం చేయాలనే ఉద్దెశం తో అంబేద్కర్ కమిటీలను నిర్మాణం చేయడం జరిగింది. మంగపేట మండలంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం మండలం కమిటీ అలాగే సబ్ డివిజన్ కన్వీనర్ బసరికాని హరికృష్ణ మోదుగుబాబు జిల్లా కన్వీనర్ ఎడ్ల నరేష్ లను నియమించడం జరిగింది.