ఇందిరమ్మ గృహప్రవేశాలు ప్రారంభించిన బోధన్ ఎమ్మెల్యే
బోధన్, జూన్ 3 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా లక్ష గృహప్రవేశాల కార్యక్రమం బుధవారం బోధన్ పట్టణంలో ఘనంగా ప్రారంభమైంది.
శక్కనగర్ వార్డులో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు, ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి నూతన గృహ ప్రవేశాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ... పేద ప్రజల సొంతింటి కలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ఇందిరమ్మ ఇళ్ల ద్వారా అర్హులైన ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు అందిస్తామని అన్నారు.
ఈ సందర్భంగా ఇందిరమ్మ గృహ లబ్ధిదారులకు ఎమ్మెల్యేకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఆర్డీవో శ్రీమతి ఎం.విజయ్ కుమారి, ఎమ్మార్వో విట్టల్, మున్సిపల్ కమిషనర్ యాదవ్ కృష్ణ, మున్సిపల్ చైర్మన్ పద్మ శరత్ రెడ్డి, వైస్ చైర్మన్ ఇలియాస్ అలీ, బోధన్ టౌన్ అధ్యక్షుడు అంకుదాము, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నాగేశ్వరరావు, కాంగ్రెస్ మైనార్టీ పట్టణ అధ్యక్షుడు పాషా మోహినుద్దీన్, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.






