4 June, 2026 | 1:32 AM

జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం

04-06-2026 12:42 AM

గాంధారి, జూన్ 3 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చద్మల్ తండాలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ ప్రత్యేక చొరవతో గాంధారి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ప్రారంబించారు.

ఇటీవల చద్మల్ తండాతో పాటు పరిసర గ్రామ రైతులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ ను కలిసి తమ ప్రాంతంలో జొన్నల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేయడంతో రైతుల ఇబ్బందులను గుర్తించిన ఎమ్మెల్యే వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో వెంటనే మాట్లాడి చద్మల్ తండాలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయించారని రైతులు తెలిపారు.

పరిసర గ్రామాల రైతులు తమ జొన్న పంటను కొనుగోలు కేంద్రానికి తరలించి విక్రయించాలని స్థానిక నాయకులు సూచించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు మాట్లాడుతూ తమ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ రైతుల ఇబ్బందులు తెలుసుకొని రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు , రైతులు పాల్గొన్నారు.