25 May, 2026 | 7:26 PM

ఆ దేవుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి: పిల్లుట్ల రఘు

25-05-2026 06:52 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలం భీమ్లా తండ గ్రామంలోని బొడ్రాయి 5 వార్షికోత్సవంలో పాల్గొని దేవుడు ఆశ్శీస్సులు ప్రజలందరి పై ఉండాలని బిఆర్ఎస్ పార్టీ నాయకులు పిల్లుట్ల రఘు అన్నారు. అనంతరం బొడ్రాయి దగ్గర కొబ్బరికాయ కొట్టి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలలో పాల్గొని  గ్రామస్తులతో  కలిసి బోనాలు సమర్పించారు. గ్రామస్తులను ఆప్యాయంగా పలకరిస్తూ వారితో సరదాగా నృత్యం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వం అందరూ ధైర్యంగా ఉండాలి ఎవరు అధైర్య పడొద్దు ప్రతి ఒక్కరికి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. అక్రమ కేసులు పెడితే ఎవరిని వదిలేది లేదని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బానోతు జగన్ నాయక్, బిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.