25 May, 2026 | 7:26 PM

నకిలీ పత్తి విత్తనాల గుట్టు రట్టు.. నలుగురు నిందితులు అరెస్టు

25-05-2026 06:56 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకునీ నలుగురిని అరెస్టు చేశారు. వివరాలను తాండూర్ సీఐ కార్యాలయంలో సోమవారం సంఘటన వివరాలను బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ వెల్లడించారు. రెచ్చిని గ్రామ శివారులోని బ్రిడ్జి వద్ద బైక్‌పై రొళ్లపాడు నుంచి నకిలీ పత్తి విత్తనాలను తీసుకువచ్చి కొనుగోలుదారులకు అందజేస్తున్నారనే సమాచారంతో తాండూర్ ఎస్సై కె.ప్రసాద్, మండల వ్యవసాయ అధికారి కొండ్లే సుష్మ తమ సిబ్బందితో తనిఖీలు చేశారు.

ఈ సందర్భంగా బైక్‌పై సంచిలో తరలిస్తున్న 30 కిలోల  నకిలీ పత్తి విత్తనాలు  పట్టుబడ్డాయి.  నకిలీ పత్తి విత్తనాలు లతో రొళ్లపాడు రెచ్చిని గ్రామాలకు చెందిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. గోగర్ల మల్లేష్, ముక్క శ్రీకాంత్, గాండ్ల మహేష్ ,పిడుగు లక్ష్మణ్ నకిలీ పత్తి విత్తనాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాకు చెందిన తిరుమలశెట్టి రామకృష్ణ అనే వ్యక్తి నుంచి తీసుకువస్తున్నారు.  పొలాలను కౌలుకు చేస్తున్న మల్లేష్ ద్వారా మోటార్ సైకిల్‌పై విత్తనాలను తరలించి రెచ్చిని గ్రామస్థులకు అందజేస్తున్నారు. 

నకిలీరైతులు ప్రభుత్వం అనుమతించిన పత్తి విత్తనాలనే వినియోగించాలని, లైసెన్సు కలిగిన ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లోనే కొనుగోలు చేసి తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని సూచించారు. దళారుల మాయమాటలు నమ్మి నకిలీ విత్తనాల బారిన పడవద్దని కోరారు. సమావేశంలో తాండూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ దేవయ్య, మండల వ్యవసాయ అధికారి కొండ్లే సుష్మ, ఎస్సై ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు.