calender_icon.png 17 January, 2026 | 8:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ లో చేరిన బొడ్ష‌ట్ ప‌ల్లి స‌ర్పంచ్ మల్లేశ్వారి

17-01-2026 06:58:51 PM

మునిపల్లి,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా మునిప‌ల్లి మండ‌లం బొడ్ష‌ట్ ప‌ల్లి గ్రామ స్వ‌తంత్ర స‌ర్పంచ్ మ‌ల్లేశ్వ‌రి సంగ‌న్నతోపాటు ప‌లువురు వార్డు స‌భ్యులు,  కాంగ్రెస్, బీజేపీల‌కు చెందిన సుమారు 150మంది నాయ‌కులు, కార్య‌క‌ర్తలు శ‌నివారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయ‌కుడు పైత‌ర సాయికుమార్,  బీఆర్ఎస్ బొడ్ష‌ట్ ప‌ల్లి గ్రామ శాఖ అధ్య‌క్షుడు ద‌త్తు  ముదిరాజ్ ల ఆధ్వ‌ర్యంలో మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీష్ రావు, అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిర‌ణ్ ల స‌మ‌క్షంలో హైద‌రాబాద్ లోని హ‌రీష్ రావు ఇంట్లో బీఆర్ఎస్ లో చేరారు. ఈ సంద‌ర్భంగా పార్టీలో వారంద‌రికి  గులాబీ కండువాలు వేసి పార్టీలోకి  ఆహ్వానించారు.

ఈ సంద‌ర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే త‌న్నీరు హ‌రీష్ రావు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ ల పేరుతో  ప్రజలను వంచించి అధికారంలోకి వచ్చి  ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలుపరచకుండా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసింద‌న్నారు. రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, ప్రజలు కేసీఆర్ పాలన రావాలని ఎదురుచూస్తున్నారని వారన్నారు.  బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఏ క‌ష్టం వ‌చ్చినా..  పార్టీ, తాను  అండగా  ఉంటాన‌ని  హామీనిచ్చారు.   బిఆర్ఎస్ పార్టీ సర్పంచులు  గ్రామ అభివృద్ధికి తోడ్పడి ప్రజలతో మమేకమై ప్రజల విశ్వాసాన్ని చురుగొనాలని ఈ సందర్భంగా వారున్నారు.