17-01-2026 06:55:18 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో గృహజ్యోతి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను సిర్పూర్ నియోజకవర్గం బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాచకొండ వర్ధన్ విద్యుత్ శాఖ అధికారులతో కలిసి పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీ లలో భాగంగా గృహజ్యోతి పథకం అర్హులైన లబ్ధిదారులకు ప్రజా ప్రభుత్వం గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తుందన్నారు.
రాష్ట్రంలోని 52,82,498 కుటుంబాలు జీరో విద్యుత్ బిల్లుల ద్వారా లబ్ధి పొందుతున్నారని అన్నారు. ప్రజలపై ఆర్థిక భారం తగ్గించడమే కాకుండా ప్రజా ప్రభుత్వం సంక్షేమ పాలనకు నిదర్శనం భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలను కొనసాగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ ధర్మయ్య, జూనియర్ లైన్మెన్ బాలాజీ, ఉప సర్పంచ్ రాచకొండ ఆదర్శ్ లబ్ధిదారులు పాల్గొన్నారు.