17-01-2026 07:01:41 PM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): మండలంలోని తిమ్మాపురం, రామన్నగూడెం, అర్వపల్లి, జాజిరెడ్డిగూడెం, కోడూరు, కొమ్మాల తదితర గ్రామాలలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలలో జాన్ ఆరోగ్య కమిటీ సమావేశాలను శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లోని ఆశా వర్కర్లకు యూనిఫాం చీరలను పంపిణీ చేశారు. అనంతరం పలువురు సర్పంచులు, అధికారులు మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంలో ఆశా వర్కర్ల పాత్ర కీలకమని ఆశాలను అభినందించారు. కరోనా సమయంలో వారు అందించిన సేవలను ప్రశంసించారు.
ఆయా కార్యక్రమాల్లో మండల వైద్యాధికారి డాక్టర్ భూక్యా నగేష్ నాయక్,తహసీల్దార్ శ్రీకాంత్, ఎంపీఓ గోపి, సీహెచ్ఓ బిచ్చునాయక్, సర్పంచులు చిల్లంచర్ల విద్యాసాగర్, బింగి కృష్ణమూర్తి, బొడ్డు ఇందిరాసోమరాజు, కుంటిగొర్ల శ్రీను, కర్నాటి వెంకన్న, వల్లపు అవిలమ్మ, హెల్త్ సూపర్వైజర్ లలిత, వాణి వార్డు సభ్యులు బొల్లం ప్రభాకర్, సత్తిరెడ్డి, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.