calender_icon.png 2 February, 2026 | 7:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాడీ ఫ్రీజర్ బాక్స్ అందజేత

02-02-2026 12:00:00 AM

మహబూబాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కంబాలప ల్లిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ పెన్షన్ దారులు కలిసి గ్రామ సర్పంచి వ సంత ఉపేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ కమటం యాకన్న, వార్డ్ సభ్యుల సమక్షంలో గ్రామ పంచాయతీకి బాడీ ఫ్రీజర్ బాక్స్ అందజేశారు. గ్రామంలో ఎవరైనా మరణించినప్పు డు పార్దివదేహాన్ని కుటుంబ సభ్యులు బం ధువులు కడసారి చూపు కోసం నిరీక్షించేందుకు ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో బాడీ ఫ్రీజర్ బాక్స్ అందజేసినట్లు తెలిపారు.

త్వరలో వైకుంఠ రథం కూడా అందజేస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు రామసహాయం శ్రీధర్ రెడ్డి, కొ లిశెట్టి సత్యనారాయణ, భాస్కర్, షాహిద్ అ లీ, నీలకుర్తి ఉపేందర్ రెడ్డి, సప్పిడి రవి, రిటై ర్ ఉపాద్యాయులు పార్నంది రాములు, గుడేల్లి నాగయ్య, సజ్జనపు విద్యాసాగర్, కొం పెల్లి నరేష్, ఇమామ్, చార గుండ్ల రమేష్ , కొంపల్లి వినయ్, రాచకొండ రవి, అంకిటి మహేందర్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.