9 August, 2026 | 2:26 AM

గల్లంతైన భక్తుడి మృతదేహం లభ్యం

09-08-2026 12:22 AM

11 రోజుల క్రితం జంపన్న వాగులో కొట్టుకుపోయిన తిమ్మయ్య

ములుగు, ఆగస్టు 8 (విజయక్రాంతి): మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల దర్శనానికి 11 రోజుల క్రితం హైదరాబాదులోని ఘట్‌కేసర్ నుంచి వచ్చి జంపన్న వాగు లో గల్లంతైన భక్తుడు తిమ్మయ్య మృతదే హం శనివారం లభించింది. వరద ఉధృతిలో కొట్టుకుపోయిన తిమ్మయ్య ఆచూకీ కోసం పోలీసులు, బంధువులు, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు తీవ్రంగా గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.శనివారం వాగులో ఉధృతి తగ్గడం ఇసుకలో కూరుకుపోయిన మృతదేహం వద్దకు కుక్కలు చేరడానికి గమనించి అక్కడికి పోలీసులు వెళ్లడంతో బయటపడింది. కుటుంబ సభ్యులను రప్పించి మృతదేహాన్ని వెలికి వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు.