calender_icon.png 17 September, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యాచక వృద్ధురాలిపై లైంగికదాడి

17-09-2025 12:44:05 AM

ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 16: యాచక వృద్ధురాలిపై గుర్తుతెలియని వ్యక్తి లైంగికదాడికి పాల్పడిన ఘటన ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సిఐ మహేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మూడు రోజుల క్రితం ఓ గుర్తుతెలియని యాచక వృద్ధురాలు (60) బిక్షాటన చేస్తూ రాత్రివేళ సాగర్ రహదారిపై, ఆర్టీసీ దుకాణ సముదాయాల వద్ద సేద తీర్చుకుంటుండగా.. సోమవారం రాత్రి 2 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ప్రతిఘటించిన వృద్ధురాలి తలకు గాయాలయ్యాయి.  పోలీసులు వృద్ధురాలిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించి, అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఆలేటి ఆశ్రమంలో చేర్పించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ మహేందర్‌రెడ్డి తెలిపారు.