అయ్యప్ప ఆలయ కమిటీ అధ్యక్షుడిగా బొగ్గుల సురేష్
గజ్వేల్, జూన్7: గజ్వేల్ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు. ఆల య అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో బొగ్గు ల సురేష్ 31 ఓట్ల మెజార్టీతో విజయం సా ధించి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆలయానికి చెందిన మొత్తం 302 మంది శాశ్వత స భ్యులకు గాను 284 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో ఎ న్నికలు ఆసక్తికరంగా సాగాయి. అధ్యక్ష పద వి కోసం బొగ్గుల సురేష్, ఎర్రం శ్రీనివాస్ మధ్య పోటీ నెలకొనగా సభ్యుల మద్దతుతో బొగ్గుల సురేష్ గెలుపొందారు.
కార్యదర్శులుగా అయిత సత్యనారాయణ, తూము గో పి ఎన్నిక కాగా, ఉపాధ్యక్షుడిగా జగ్గయ్యగారి శేఖర్, కోశాధికారిగా నారాయణరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గజ్వేల్ మాజీ మున్సి పల్ చైర్మన్లు గాడిపల్లి భాస్కర్, ఎన్సీ రాజమౌళి ఎన్నికల అధికారులుగా వ్యవహరించి ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. ఫలితాల ప్రకటన అనంతరం ఆ లయ ప్రాంగణంలో నూతన అధ్యక్షుడు సురేష్ను సభ్యులు ఘనంగా సన్మానించారు. ఆయన అనుచరులు మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ.. తనపై విశ్వాసం ఉం చి గెలిపించిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తె లిపారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ఆధ్యాత్మిక కార్యక్రమా ల విస్తరణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. కమిటీ సభ్యులందరినీ కలుపుకొని ఆలయ అభ్యున్నతికి కృషి చేస్తానని తెలిపారు. కాగా, నూతనంగా ఎన్నికైన కార్యవర్గం మూడేళ్లపాటు బాధ్యతలు నిర్వహించ నుంది. ఆలయ నిర్వహణ, అభివృద్ధి కార్యక్రమాలు, వార్షిక ఉత్సవాల నిర్వహణలో కొత్త కమిటీ కీలక పాత్ర పోషించనుంది.






