8 June, 2026 | 2:04 AM

ముమ్మరంగా పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్

08-06-2026 12:45 AM

ఆదిలాబాద్, జూన్ 7 (విజయక్రాంతి): ఇచ్చోడ మండలంలోని ఎల్లమ్మ గూడ గ్రామంలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ఇచ్చోడ ఎస్హెచ్‌ఓ నరేష్ కుమార్ తమ పోలీస్ సిబ్బందితో కలిసి ఇంటింటి తనిఖీలు చేపట్టారు.

47 వాహనాలను తనిఖీ చేయడం జరగగా, సరైన ధ్రువపత్రాలు లేని 11 వాహనాలను తాత్కాలికంగా సీజ్ చేయడం జరిగిందని ఇచ్చోడ ఎస్హెచ్‌ఓ నరేష్ కుమార్  తెలిపారు. అక్రమంగా నిలువ ఉంచిన రూ.10 వేల విలువ గల కలపను స్వాధీనం చేసుకుని, షేక్ రషీద్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో నిర్వహించిన సమావేశంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల వల్ల యువత భవిష్యత్తు నాశనమవుతుందని, వాటికి పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు.

రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించి ప్రమాదాలను నివారించుకోవాలని అవగాహన కల్పించారు. అదేవిధంగా గ్రామాల్లో నేర నియంత్రణ, భద్రత కోసం ప్రతి ఇంటి వద్ద, వ్యాపార సంస్థల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా అసాంఘిక కార్యకలాపాల గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల సహకారంతోనే శాంతిభద్రతల పరిరక్షణ సాధ్యమవుతుందని, పోలీసు-ప్రజల సమన్వయంతో నేరాల నియంత్రణకు కృషి చేస్తామని తెలిపారు.  సిరికొండ ఎస్త్స్ర విక్రం, ఎస్త్స్ర లీలాకృష్ణ, ఇచ్చోడ పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఏఆర్ ఫోర్స్, స్పెషల్ పార్టీ సిబ్బంది మరియు డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు