అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్
07-07-2024 03:27 PM
అమారవతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలో బాయిలర్ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను విజయవాడ ఆసుపత్రి తరలించారు. గ్రామస్తులు కంపెనీ ఆఫీసుపై దాడి చేశారు. గాయపడ్డవారిని కంపెనీ సరిగ్గా పట్టించుకోలేదంటూ ఆరోపిస్తూ రాళ్ల దాడికి దిగారు. గ్రామస్తుల దాడిలో ఆఫీస్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ప్రస్తుతం భారీగా పోలీసుల మోహరించారు. గాయపడిన వారిని యూపీ, బీహార్లకు చెందిన కార్మికులుగా గుర్తించారు.






