10 May, 2026 | 9:07 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

ఓటీటీలోకి షకీలా బయోపిక్

28-02-2025 12:00 AM

ప్రముఖ నటి షకీలా జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘షకీలా’. ఇంద్ర జీత్ లంకేశ్ బాలీవుడ్‌లో రూపొందించిన ఈ బయోపిక్‌లో షకీలా పాత్రలో బాలీవుడ్ అందాల తార రిచా చద్దా నటించింది. పంకజ్ త్రిపాఠీ, టాలీవుడ్ నటి ఎస్తర్ నోరన్హా, రాజీవ్ పిళ్లు, శివ రానా, కాజోల్ చుగ్, సందీప్ మలని తదితరులు కీలక పాత్రలు పోషించారు. 2020 డిసెంబర్ 25న థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. హిందీ, తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో ఈ బయోపిక్‌ను రిలీజ్ చేశారు.

అయితే షకీలా సినిమా యావరేజ్‌గా నిలిచింది. ఎక్కువగా అడల్డ్ కంటెంట్ ఉండడంతో ఓ వర్గం ప్రేక్షకులే ఈ సినిమాను ఆదరించారు. దీనికి తోడు షకీలాకు ఉన్న క్రేజ్ వల్ల ఈ మూవీ విడుదలైన వెంటనే పైరసీ బారిన పడింది. ఏకంగా యూట్యూబ్‌లలో కూడా ఈ చిత్రాన్ని షేర్ చేశారు. కాగా ఇప్పుడు ఈ బోల్డ్ మూవీ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.

థియేటర్లలో రిలీజైన ఐదేళ్ల తర్వాత షకీలా మూవీ స్ట్రీమింగ్‌కు రావడం గమనార్హం. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో షకీలా సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం కేవలం హిందీ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది.

దీంతో టాలీవుడ్ ఆడియెన్స్ తెలుగు వర్షన్ కోసం సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. అయితే మరో రెండు రోజుల్లో తెలుగు వర్షన్ కూడా స్ట్రీమింగ్‌కు రావచ్చని తెలుస్తోంది. ప్రకాశ్ పళని సమర్పణలో సమ్మి నన్వనీ, శరవణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. వీర్ సమర్ధ్ సంగీతం అందించారు.

కాగా మహేశ్‌బాబు హీరోగా నటించిన పోకిరి సినిమాలో ప్రకాశ్‌రాజ్ గర్ల్‌ఫ్రెండ్‌గా నటించిన శివ్ రానా ఈ సినిమాలో సిల్క్ స్మిత రోల్ పోషించడం విశేషం. సినిమా ఇండస్ట్రీలో మంచి నటిగా పేరు తెచ్చుకోవాలనుకున్న షకీలా.. శృంగార తారగా ఎలా మారిందన్నదే సినిమా కథ. షకీలా పడ్డ కష్టాలు, సొంత కుటుంబ సభ్యుల నుంచి ఆమెకు ఎదురైన అవమానాలు, మోసాలను ఈ చిత్రంలో చూపించారు.