21 July, 2026 | 9:10 AM

మంత్రి ఉత్తమ్ దంపతులను విమర్శించే అర్హత బొల్లం మల్లయ్యకు లేదు

20-07-2026 08:11 PM

- రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య 

- రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు

హుజూర్ నగర్: మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేనందున తన ఉనికిని కాపాడుకునేందుకే మంత్రి ఉత్తమ్ దంపతులపై అసత్య ఆరోపణలు చేస్తున్నాడని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. సోమవారం పట్టణంలోని ఇందిరా భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు గెల్లి రవి అధ్యక్షతన నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లుతో కలిసి మాట్లాడారు.

కోదాడ,హుజూర్ నగర్ అభివృద్ధి ప్రదాతలు మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి  దంపతులను విమర్శించే అర్హత మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యకు లేదన్నారు.గతంలో కోదాడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి పనికి కమిషన్ తీసుకున్నందున గత ఎన్నికల్లో  కోదాడ నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పారని విమర్శించారు.  అన్నారు.బీసీ నినాదం పేరుతో బీసీ బిడ్డలను జైలుకు పంపిన చరిత్ర బొల్లం మల్లయ్యదేనని అన్నారు.బీసీల పేరుతో బొల్లం మల్లయ్య రాజకీయ పబ్బం గడుపుతున్నాడని విమర్శించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గెల్లి రవి,మాజీ జెడ్పిటిసి గల్లా వెంకటేశ్వర్లు, కిషోర్,కస్తాల దిల్,గణేష్, తదితరులు,పాల్గొన్నారు.