ఏకాగ్రతతో చదవండి.. లక్ష్యాన్ని చేరుకోండి
20-07-2026 08:14 PM
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ గ్రామర్ హైస్కూల్ విద్యార్థులు మద్రాసు ఐఐటి నిర్వహించిన ఆన్ లైన్ పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మద్రాసు ఐఐటి కళాశాల వారు 16 మంది విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేసింది. ఈ సందర్భంగా వారు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డిని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించి, శుభాకాంక్షలు తెలియజేసి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. మహబూబ్ నగర్ లోని విద్యార్థుల ప్రతిభకు కొదవలేదన్నారు. ఎంతటి లక్ష్యమైనా సాధించగలరని చెప్పారు.






