4 March, 2026 | 11:34 PM

సైబర్ నేరగాళ్ల నుంచి అప్రమత్తంగా ఉండాలి

04-03-2026 09:57 PM

బొల్లారం ప్రవేశ పరిశ్రమలో అవగాహన కార్యక్రమం

జిన్నారం/అమీన్ పూర్: హాలీడే ప్యాకేజీ ఫేక్ కస్టమర్ సర్వీస్ సెల్ టవర్ ఏర్పాటు హోటల్ బుకింగ్ పేరుతో అనుచిత ఫోన్ కాల్స్ చేస్తున్న వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ప్రవేశ పరిశ్రమలో బొల్లారం పోలీసులు కార్మికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బొల్లారం ఎస్ఐ కిష్టారెడ్డి ,సైబర్ క్రైమ్ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమం లో కార్మికులకు పలు సూచనలు చేశారు. ప్రతీ వారం నిర్వహించే అవగాహన కార్యక్రమంలో భాగంగా సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.