4 May, 2026 | 3:15 PM

Breaking News

కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •  

నాగిరెడ్డి పేటలో అధిక ధరలకు యూరియా బస్తాల విక్రయాలు

04-03-2026 09:54 PM

ఫర్టిలైజర్ దుకాణం ఎదుట రైతుల నిరసన

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీ ట్రేడర్స్ ఫర్టిలైజర్ దుకాణం యజమాని ప్రభుత్వ నిబంధనల ప్రకారం విక్రయించాల్సిన యూరియా బస్తాను 30 రూపాయల అదనపు దరకు విక్రయిస్తున్నారు. మండల కేంద్రం గోపాల్ పేట్లో బుధవారం శ్రీలక్ష్మీనరసింహ ట్రేడర్స్ ఫర్టిలైజర్ దుకాణంలోకి 450 బస్తాల యూరియా వచ్చింది. దీంతో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు యూరియా యాప్ ద్వారా యూరియా బస్తాలను బుక్ చేసుకున్నారు,ఫర్టిలైజర్ దుకాణం యజమాని ఒక్కో యూరియా బస్తా 265 రూపాయలకు విక్రయించాల్సింది.

ఉండగా, రూ.300లకు విక్రయిస్తూ, 30 రూపాయలు అదనంగా వసూలు చేశాడు. దీంతో రైతన్నలు ఇదేమిటని ప్రశ్నించి దుకాణం ఎదుట ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న  మండల వ్యవసాయ అధికారి సాయికిరణ్ ఫర్టిలైజర్ దుకాణం వద్దకు వెళ్లి దుకాణ యజమానికి రూ.265లకే యూరియా బస్తాలు విక్రయించాలని ఆదేశించాడు. ఫర్టిలైజర్ దుకాణం ఎదుట రైతులు అందోళన చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఫర్టిలైజర్ దుకాణం యజమానిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ దుకాణం వద్దని ఏవో సాయి కిరణ్ కు ఫిర్యాదు చేశారు. దీంతో రైతన్నల ఆందోళనకు తలొగ్గిన షాప్ యజమాని యూరియా బస్తాను 270 రూపాయలకు రైతులకు విక్రయించాడు.