24 May, 2026 | 7:40 PM

బాలీవుడ్‌కు ఆప్షనే లేదు.. సౌత్ నటులు కావాల్సిందే..

31-01-2025 12:10 AM

బాలీవుడ్ వాళ్లకు ఇకపై వేరే ఆప్షన్ లేదని.. దక్షిణాది నటులు అవసరమని నటి రెజీనా వ్యాఖ్యానించింది. గతంలో బాలీవుడ్ పరిస్థితులను నేటితో పోలుస్తూ ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “బాలీవుడ్ వాళ్లకు ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు. గతంలో గడ్డు పరిస్థితులుండేవి. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి.

గతంలో దక్షిణాది తారలకు బాలీవుడ్‌లో అవకాశం దొరకడం చాలా కష్టంగా ఉండేది. అప్పట్లో సౌత్ నుంచి వచ్చిన వాళ్లకు ఛాన్సులు వచ్చేవి కాదు. దానికి భాషాపరమైన ఇబ్బందులు సైతం ఓ కారణమై ఉండొచ్చు. కానీ కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయయాయి. సౌత్‌కి చెందిన తారలకు అవకాశాలు లభిస్తున్నాయి.

తమ చిత్రాలను అన్ని పరిశ్రమలకు దగ్గర చేయడం కోసం దక్షిణాది తారలను తమ సినిమాల్లోకి తీసుకుంటున్నారు” అని రెజీనా తెలిపింది. తాను కూడా ఒక బాలీవుడ్ ప్రాజెక్టుకు సైన్ చేశానని.. త్వరలోనే దానికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తానని రెజీనా పేర్కొంది.

ప్రస్తుతం ఆమె ‘విదాముయార్చి’ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో త్రిష కథానాయిక కాగా.. అర్జున్ కీలక పాత్ర పోషించారు. ఆయనకు జోడిగా రెజీనా నటించింది.