30 July, 2026 | 1:15 AM

ప్రజాభవన్, నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు

29-05-2024 01:44 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 28 (విజయక్రాంతి): తెలంగాణలో ఆకతాయిల బెది రింపు ఫోన్‌కాల్స్ పోలీసులతో పాటు నగర ప్రజలను ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. మంగళవారం ప్రజాభవన్‌లో బాంబు పెట్టామని, కాసేపట్లో కూల్చేస్తామని గుర్తుతెలియని వ్యక్తులు పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి హెచ్చరించడంతో అలర్ట్ అయిన పోలీసులు.. బాంబ్ స్కాడ్ బృందాలతో వెళ్లి ప్రజాభవన్‌తో పాటు, నాంపల్లి కోర్టులో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కానీ, ఎలాంటి బాంబు లు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఆకతాయిల పనేనని నిర్ధారించారు. ఫేక్ కాల్ చేసిన ఆగంతకుడి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.