17 April, 2026 | 5:59 AM

వరంగల్ జిల్లా కోర్ట్‌కు బాంబు బెదిరింపు

21-06-2025 02:32 AM

100 కి ఫోన్ చేసి చెప్పిన గుర్తు తెలియని వ్యక్తి

హనుమకొండ జూన్ 20 (విజయ క్రాంతి): హనుమకొండ అదాలత్ లోని వరంగల్ జిల్లా కోర్టు ప్రాంగణంలో బాంబు ఉన్నదని శుక్రవారం 100 కి కాల్ చేసిన గుర్తు తెలియని వ్యక్తి. సుబేదారి సీఐ రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు వెంటనే అప్రమత్తమై కోర్టు ఆవరణంలో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేయడం జరిగింది. ఈ తనిఖీలో కోర్టు ఆవరణంలో భద్రపరిచిన 6 డీటోనేటర్లు స్వాధీనం చేసుకున్నారు.

ఒక కొట్టుడు పోయిన కేసుకు సంబంధించిన డీటోనేటర్లు గా బాంబు డిస్పోజ్ స్క్వాడ్ గుర్తించినారు. బెదిరింపు కాలుకు, ఈ డిటోనేటర్లకు ఎలాంటి సంబంధం లేదని పోలీసులు, కోర్టు సిబ్బంది అన్నారు. బెదిరింపు కాల్ చేసిన అజ్ఞాత వ్యక్తి కోసం విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.