17 April, 2026 | 7:14 AM

యూసుఫ్‌కు నివాళి

21-06-2025 02:32 AM

వలిగొండ,జూన్20(విజయక్రాంతి): వలిగొండ బిఆర్‌ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ అప్రోజ్  తండ్రి మహమ్మద్ యూసఫ్ అనారోగ్యంతో మరణించగా భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మల వెంకటరెడ్డి, మాజీ జెడ్పిటిసి మొగుళ్ళ శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్ సురకంటి వెంకటరెడ్డి, కందడి భూపాల్ రెడ్డి, మాజీ ఎంపిటిసి పల్సం రమేష్, కాసుల మధు, బల్గూరి నరేష్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.