23 July, 2026 | 8:22 PM

ఢిల్లీలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం

01-06-2024 12:05 AM

చైర్మన్ సి.రాజేందర్ యాదవ్

చార్మినార్, మే 31 : లాల్‌దర్వాజ సింహ వాహిని శ్రీ మహంకాళి బోనాల ఉత్సవాలను దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ చెన్నబోయిన రాజేందర్ యాదవ్ తెలిపారు. శుక్రవారం ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలం గాణ సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బోనాల ఉత్సవాలను ఢిల్లీలో నిర్వహిస్తూ మన సంస్కృతి దేశానికి చాటేలా కృషి చేస్తున్నామన్నారు. జూలై 7న అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 200 మందితో ఢిల్లీ బయలుదేరి వేడుకల్లో పాల్గొంటామన్నారు. జులై 8 నుంచి 10వ తేదీ వరకు మూడు రోజుల పాటు బోనాల సంబురాలు వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఢిల్లీలో నిర్వహించే ఈ బోనాల జాతర ఉత్సవాలకు కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు ప్రియంకగాంధీ, బీజేపీ సీనియర్ నాయకు రాలు స్మృతిఇరానీతో పాటు తెలంగాణకు చెందిన పలువురు మం త్రులు హజరవుతున్నట్లు రాజేందర్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన కార్యదర్శి బి.మారుతి యాదవ్, కన్వీనర్ జి.అరవింద్ కుమార్‌గౌడ్, కోశాధికారి పి.సతీష్ ముదిరాజ్ పాల్గొన్నారు.