రంజిత్‌రెడ్డిని కలిసిన కల్పన ఏకాంతగౌడ్
01-06-2024 12:05 AM
కూకట్‌పల్లి, మే 31 (విజయ క్రాంతి) : శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ జగదీశ్వర్‌గౌడ్ సహకారం మేరకు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలిగా నియమితులైన ఉప్పల కల్పన ఏకాంత్‌గౌడ్ శుక్రవారం చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తనపై నమ్మకం ఉంచి సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షురాలుగా అవకాశం ఇచ్చినందునందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి కార్యకర్తను కలుపుకొని పోతూ నిరంతరం పార్టీ కోసం కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పల్నాటి రవి, వినోద్, శృతిగౌడ్, షాలిని, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.






