18 May, 2026 | 3:30 AM

నగరంపల్లిలో ఘనంగా బోనాల పండుగ

18-05-2026 02:30 AM

జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) మే 17 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం నగరంపల్లి గ్రామంలో శ్రీకృష్ణ యాదవ సంఘం ఆధ్వర్యంలో  ఆదివారం బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. మొదట గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు బోనాలతో డప్పు చప్పుళ్ళ మధ్య ఊరేగింపుగా దేవాలయానికి తరలి వెళ్లారు.

ఈ సందర్భంగా గ్రామంలోని భూలక్ష్మి, మహాలక్ష్మి, పోచమ్మ దేవాలయం, పెద్దమ్మ తల్లి ఆలయం, బీరన్న గుడి వద్ద యాదవ కులస్థులు గ్రామస్థులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలు ఆయురారోగ్యాలతో జీవించాలని, పాడి పంటల సమృద్ధి కోసం బోనాల పండుగ నిర్వహించినట్లు శ్రీకృష్ణ యాదవ సంఘ సభ్యులు  వంగ కుమారస్వామి యాదవ్, పెద్ద గొల్ల గొర్రె ఎల్లయ్య యాదవ్ సారగొల్ల లు తెలిపారు.