వరుణ దేవా కరుణించు
వర్షాలు కురవాలని ఆలయాల్లో జలాభిషేకాలు
గ్రామాల్లో కప్పతల్లి ఆటలు
మానకొండూరు, (విజయక్రాంతి): వర్షాకాలం ప్రారంభమై నెలలు గడిచినా, జాడ లేని చినుకు కోసం ఎదురు చూసినా, కారు మబ్బులు కానరాక, వరుణ దేవుని కటాక్షం కోసం కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని పచ్చునూరు, కొండపల్కల గ్రామాల ఆలయాల్లో గ్రామ ప్రజలు జలాభిషేకాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కరువు తరలి వెళ్లాలి , సమృద్ధిగా వానలు కురవాలని , సాంప్రదాయ కప్పతల్లి ఆట ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వరుణ దేవుని ప్రార్థించారు. వర్షాలు కురిసే సమృద్ధిగా పంటలు పండాలని కోరుకుంటూ, సమిష్టిగా ఆయా గ్రామాల ప్రధాన వీధుల గుండా డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా గ్రామస్తులందరూ మూకుమ్మడిగా తరలి వెళ్లి ఆయా ఆలయాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండాలని పాడిపంటలతో సుఖసంతోషాలతో ఉండేలా ఆశీర్వదించాలని దేవుళ్ళని వేడుకున్నారు. ఆయా గ్రామల ప్రథమ పౌరులు పచ్చునూరు సర్పంచ్ పార్నంది కేశవ్ (కిషన్), కొండపల్కల సర్పంచ్ మాడలక్ష్మీ తిరుపతిరెడ్డి, వివిధ పార్టీల నాయకులు, రొంటాల లక్ష్మారెడ్డి, నర్మెట వీరయ్య,ఉప సర్పంచ్ అనిల్ గౌడ్, సభ్యులు పిట్టల మల్లేశం, కొమ్మల్ల నరేష్, పూసల సతీష్, కందిప్రవిత్ర, కల్వల రవి, పిన్నింటి కేశవ రెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షులు రామంచ ప్రవీణ్,మాజీ సర్పంచ్ బైకా మోహన్, కసిరెడ్డి సంపత్ రెడ్డి, సీతా కనుకయ్య, గోపు రాంరెడ్డి, కూరాకుల పోశాలు గోపు లక్ష్మారెడ్డి, ప్రముఖులు, రైతులు, గ్రామ ప్రజలు, తదితరులు ఈ ఉత్సవంలో భాగస్వాములయ్యారు.






