ఘనంగా ప్రారంభమైన జేపీఎల్- 2 ప్రీమియం లీగ్
తిరుమలాయపాలెం మే 17 (విజయక్రాంతి): తిరుమలాయపాలెం మండల పరిధిలోని జింకలగూడెం గ్రామంలో నిర్వహిస్తున్న జేపీఎల్-2 జింకలగూడెం ప్రీమియం లీగ్ క్రికెట్ టోర్నమెంట్ను తిరుమలాయపాలెం ఎస్‌ఐ కూచిపూడి జగదీష్ రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొప్పుల అశోక్, బెల్లం శ్రీనివాస్, గ్రేటర్ ఇన్ఫ్రా చైర్మన్ సయ్యద్ ఇమాం ప్రారంభ కార్యక్రమంలో పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలు యువతలో ఐక్యత, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందించడంతో పాటు ఆరోగ్యాన్ని కాపాడటంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని తెలిపారు. గ్రామీణ స్థాయిలో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో గోల్ తండా సర్పంచ్ బాణోత్ సుజాత అనిల్ కుమార్, భాగ్యలక్ష్మి కాటన్ మిల్ రేవురి వెంకన్న, శ్రీ శ్రీనివాస రైస్ ఇండస్ట్రీ జయమ్మ, గ్రామ పెద్దలు షేక్ కరీం, సయ్యద్ సీలర్, సయ్యద్ మదర్, సయ్యద్ పయజ్, బాణోత్ ప్రసాద్, బాణోత్ రమేష్, షేక్ నజీర్ తదితరులు పాల్గొన్నారు. టోర్నమెంట్ విజయవంతానికి మేనేజ్మెంట్ సభ్యులు ప్రత్యేకంగా కృషి చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.






