డీజిల్, పెట్రోల్ ధరలు పెంపుపై కాంగ్రెస్ నేతల నిరసన
సత్తుపల్లి మే 17. ( విజయ క్రాంతి ): బీజేపీ కేంద్రం ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్ రేట్లు పై నిరసన వ్యక్తం చేస్తూ సత్తుపల్లి అంబేద్కర్ విగ్రహం నుండి బాలాజీ థియేటర్ మీదుగా బస్టాండ్ రింగ్ సెంటర్ వరకు సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించటం జరిగింది... భారతదేశ ప్రజలపై పెంచిన పెట్రోల్, డీజిల్ రేట్లు వలన ప్రజలకు తీవ్ర ప్రభావం, భారం పడుతుంది అని బీజేపీ కేంద్ర మొండి వైఖరి పై నిరసన తెలుపుతూ భారీ ర్యాలీ నిర్వహించిన సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ....
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ రిహానా బేగం కమలపాషా, మున్సిపల్ వైస్ చైర్మన్ బొంతు సుమలత, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నారావు, సత్తుపల్లి నియోజకవర్గం ఎన్ ఎస్ యు ఐ. అధ్యక్షులు సందీప్ గౌడ్,సత్తుపల్లి మున్సిపల్ కౌన్సిలర్స్, సీనియర్ నాయకులు చల్లగుళ్ల నరసింహ రావు, చల్లగుళ్ల కృష్ణయ్య,సత్తుపల్లి నియోజకవర్గం ఎస్సీ. బీసీ. ఎస్టి. సెల్ కాంగ్రెస్ నాయకులు, సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు, సత్తుపల్లి పట్టణం మరియు మండలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, నాయకులు పాల్గొన్నారు..






