11 August, 2026 | 6:37 PM

దన్నూర్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బోనాల పండుగ వేడుకలు

11-08-2026 05:34 PM

బోథ్,(విజయక్రాంతి): మండలంలోని దన్నూర్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం బోనాల పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు అమ్మవారి వేషధారణలో వేపకొమ్మలు చేతబట్టి పూనకం వచ్చినట్లు నృత్యం చేశారు. విద్యార్థులు పోతరాజుల వేషాలు వేసి నృత్యం చేశారు.

కార్యక్రమాన్ని తిలకించేందుకు గ్రామంలోని విద్యార్థుల తల్లిదండ్రులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తమ పిల్లలు ప్రదర్శిస్తున్న ప్రదర్శనను వీడియోలు ఫోటోలలో రికార్డు చేసుకున్నారు. ప్రధానోపాధ్యాయులు రావుల శంకర్ తో పాటుఉపాధ్యాయులను విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.