11 August, 2026 | 7:40 PM

చిట్యాలలో ప్లాస్టిక్ నిషేధం

11-08-2026 06:34 PM

నిర్మల్,(విజయక్రాంతి): పర్యావరణానికి ప్రజలకు హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ పూర్తిగా నిర్మించి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు బాధ్యులు కావాలని డి ఆర్ డి ఓ విజయలక్ష్మి డిపిఓ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం నిర్మల్ రూరల్ మండలంలోని చిట్యాల గ్రామంలో ప్లాస్టిక్ నియంత్రణపై గ్రామస్తులు తీర్మానం చేశారు. గ్రామంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ఇంటింటికి చెత్తబుట్టలు స్టీల్ బాక్సులు స్టీల్ ప్లేట్లు వాటర్ క్యాన్లు పంపిణీ చేశారు.

గ్రామంలో ఇక్కడ నుండి ప్లాస్టిక్ పూర్తిగా నిషేధిస్తున్నట్టు గ్రామ సర్పంచ్ సుప్రియ వెంకటరెడ్డి తెలిపారు ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను గ్రామస్తులకు జిల్లా అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ దేవిదాస్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజేందర్, రూరల్ తహసీల్దార్ ప్రభాకర్, రూరల్ ఎస్సై లింబాద్రి అధికారులు దాతలు పాల్గొన్నారు.