బంజారా సేవాదళ్‌ను బలోపేతం చేస్తాం
11-08-2026 06:37 PM
- రఘురాం రాథోడ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవ ఎన్నిక
కంగ్టి,(విజయక్రాంతి): బంజారా సమాజం హక్కులు ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం బంజారా సేవాదళ్‌ను మరింత బలోపేతం చేస్తామని రాష్ట్ర ఉపాధ్యక్షులు రాథోడ్ సురేష్ నాయక్ తెలిపారు. మహారాష్ట్రలోని పోహరాఘడ్‌లో నూతన రాష్ట్ర కమిటీ ఏర్పాటు సందర్భంగా ఆయన మాట్లాడారు. రఘురాం రాథోడ్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా, అశోక్ రాథోడ్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మైదాన ప్రాంత గిరిజనుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని సురేష్ నాయక్ తెలిపారు.






