బోనం ఎత్తుకున్న విద్యార్థులు వైభవంగా బోనాల పండుగ వేడుకలు
18-07-2026 06:04 PM
బోథ్,(విజయక్రాంతి): మండలంలోని కుచలాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రావ్య బోనాల పండుగ ప్రాముఖ్యతను వివరించారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా గ్రామీణ ప్రాంతాల ప్రజలు గ్రామ దేవతలైన పోచమ్మలకు నైవేద్యాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని వివరించారు. ప్రభుత్వం బోనాల పండుగను అధికారికంగా నిర్వహిస్తుందని వివరించారు.ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రణధీర్ గ్రామస్తులు పాల్గొన్నారు.మండల విద్యాధికారి మమ్మద్ హుస్సేన్ కార్యక్రమాన్ని తిలకించి ఉపాధ్యాయులను అభినందించారు.






