వ్యవసాయంపై దిశానిర్దేశం
ప్రతి ఒక్కరూ వ్యవసాయ మెలకువలు నేర్చుకోవాలి
జిల్లా జడ్పిసీఈఓ ఎల్లయ్య
తూప్రాన్,(విజయక్రాంతి): తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి లోని రైతు వేదిక లో రైతులకు వ్యవసాయం పై అవగాహన కల్పించుటకు సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పి సీఈఓ. ఎల్లయ్య హాజరై వ్యవసాయం పైన వారి అమూల్యమైన సందేశాన్ని అందించారు. హెల్దీ వాగు సమీప ఆధారిత రైతులు నాణ్యమైన పంటలు పండిచాలన్నారు. ముఖ్యంగా రైతుల నుండి పంటల పై అభిప్రాయాన్ని సేకరించారు.
ప్రతి రైతు మాట్లాడుతూ వరి తప్పా ఏ పంటలు వేసిన కోతుల బెడదా ఎక్కువ ఉందని తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలు వేస్తే బాగుటుందని, పంట మార్పిడితో లాభం చేకూరుతుంది. కానీ కోతులతో భయం ఏర్పడుతుందని వాపోయారు... రైతులు ఏకంగా వరి పంట కాక ఇతర పంటలు వేస్తే ప్రభుత్వానికి సహాయం చేసే వారీగా మీరు ఉంటారని వ్యవసాయ అధికారి అన్నారు. పంటల్లో అనేక పంటలు ఉన్నాయని అందులో పాడి పరిశ్రమ, కూరగాయలు, అయిల్ ఫామ్, పప్పు దాన్యలైనా కందులు, పెసలు, ఉలువలు, దినుసులైన మిరియాలు, ధనియాలు వేయడంతో అధిక లాభాలు పొందే అవకాశం ఉంటుందని యన్నారు.
వ్యవసాయం పైన ప్రతి గ్రామ సర్పంచ్ వారివారి గ్రామ పరిధి రైతులకు పండించే పంటలపై అవగాహన కలించాలని అన్నారు.. ఇందులో యంపిడిఓ షాలిక, ఎంపీఓ అధికారి సతీష్, ఎంఏఓ. గంగమల్లు, ఏవోలు, గ్రామ సర్పంచ్ దొమలపల్లి యాదమ్మ కృష్ణ, సర్పంచ్ లు సంతోష్ రెడ్డి, యాంజాల స్వామి, నవీన్ గౌడ్, జయరాములు, నాయకులు జింక మల్లేష్, ఆంజనేయులు, విస్తరణ అధికారులు, గ్రామల సెక్రటరీలు, వ్యవసాయదారులు, తదితరులు ఉన్నారు.






