calender_icon.png 26 December, 2025 | 4:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భువనగిరిలో గ్రామ దేవతలకు బోనాలు

15-07-2024 12:46:00 AM

యాదాద్రి భువనగిరి, జూలై 14 (విజయక్రాంతి) : భువనగిరిలోని కుమ్మరి వాడ, రైతు బజార్‌లో ఆదివారం బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పోచమ్మ తల్లి, మైసమ్మ తల్లికి బోనా లు సమర్పించారు. పసుపు, కుంకుమ బొట్లు, వేప, మామిడి కొమ్మలతో అలంకరించిన బోనాలను డప్పు వాయిద్యాల నడుమ గ్రామ దేవతల ఆలయా ల వద్దకు తీసుకెళ్లి నైవేద్యం సమర్పించారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.  మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.