రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు నిధులు కేటాయించాలి
ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్
దేవరకొండ,(విజయక్రాంతి): దేవరకొండ పట్టణ కేంద్రలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ దేవరకొండ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ మాట్లాడుతూ.. ఈ నెల 20వతేదీన అసెంబ్లీలో ప్రవేశ పెట్టె రాష్ట్ర బడ్జెట్‌లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని ప్రభుత్వని డిమాండ్ చేశారు.
ఇంజినీరింగ్, డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు రూ.8,500 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే విడుదల చేయాలని, వాటిని బడ్జెట్లో చేర్చి తక్షణం బకాయిలు విడుదల చేయాలని, వీటిపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మోర రోహన్, నాగిళ్ల కార్తీక్, ఆంబోతు గణేష్, ముసుకు గణేష్, ముదిగొండ రాఖిల్, ఉరే లక్ష్మీ ప్రశాంత్, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.




