కాంగ్రెస్ 1000 రోజుల దగా పాలనపై సమర భేరి

01-09-2026 | 02:49pm

సమరభేరి.. నిరసన ధర్నా

తుంగతుర్తి,(విజయక్రాంతి): తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ(Telangana Congress) 1000 రోజుల దగా పాలన వైఫల్యాలపై బుధవారం తుంగతుర్తిలో(Thungathurthi) నిర్వహిస్తున్న నిరసన ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని భారత్ రాష్ట్ర సమితి((Bharat Rashtra Samithi)) శ్రేణులకు విజ్నప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం అలవికాని వాగ్దానాలు ఇచ్చి అన్నివర్గాల ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి(Congress party) తగిన గుణ పాఠం చెప్పాలని అన్నారు.

తుంగతుర్తి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతూ... కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్(Kalyana Lakshmi, Shaadi Mubarak) రైతు భీమా లాంటి పధకాలను రద్దు చేసిన ప్రభుత్వానికి మహిళలు తగిన శాస్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్( Former MLA Gadari Kishore), గుజ్జ దీపిక యుగంధర్ రావు హాజ వుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండగాని రాములు గౌడ్. సర్పంచ్ లు మేడదుల రమేష్. మాతంగి వెంకటమ్మ కరుణాకర్. శ్రీనివాసరెడ్డి. మండల నాయకులు గుడిపాటి వీరయ్య గోపగాని రమేష్. మల్లెపాక రాములు మాజీ సర్పంచ్ విరోజీనాయక్.. పూర్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు