1 September, 2026 | 4:18 PM

పాత పెన్షన్ విధానం కోసం నల్ల బ్యాడ్జీలతో నిరసన

01-09-2026 02:56 PM

ముకరంపుర,సెప్టెంబర్ 1(విజయక్రాంతి): కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం(Contributory Pension Scheme) అమలులోకి వచ్చిన సెప్టెంబర్ ఒకటి తేదీని పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ తెలంగాణ ఉన్నత విద్య ఐకాస(Telangana Higher Education Union) పిలుపు మేరకు ఎస్ఆర్ఆర్(SRR) ప్రభుత్వ అటనామస్ కళాశాల సిపిఎస్ అధ్యాపకులు, ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలను ధరించి భోజన విరామ సమయంలో కళాశాల ముందు నిరసన(Protest) వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు 'సిపిఎస్ వద్దు - ఓపిఎస్ ముద్దు' సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఉన్నత విద్య ఐకాసా చైర్మన్ డాక్టర్ కడారు సురేందర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి ఆసంపల్లి నాగరాజు మాట్లాడుతూ సిపిఎస్ విధానం ఉద్యోగుల పాలిట ఒక శాపంలా మారిందని, ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) వెంటనే సిపిఎస్ ను రద్దుచేసి  ఓపిఎస్ ను పునరుద్ధరించాలని కోరారు. సిపిఎస్ నుండి పాత పెన్షన్ పునరుద్ధరణ అనేది రాష్ట్ర స్థాయిలోని అంశమని, ఇదివరకే భారతదేశంలో ఐదు రాష్ట్రాలలో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్య వికాస సంయుక్త కార్యదర్శి ఆసంపల్లి నాగరాజు, ఏవో ఉమారాణి, స్టాఫ్ క్లబ్ సెక్రటరీ డాక్టర్ ఎం శ్రీనివాసరెడ్డి, అధ్యాపకులు డాక్టర్ తాండ్ర కరుణాకర్, డాక్టర్ ఏ శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.