1 September, 2026 | 4:22 PM

పెండింగ్ స్కాలర్‌షిప్‌ల విడుదలకు టీజీవీపీ ధర్నా

01-09-2026 02:51 PM

భిక్కనూర్,సెప్టెంబర్ 01(విజయ క్రాంతి): పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్(Scholarship), ఫీజు రీయింబర్స్‌మెంట్(Fee Reimbursement) బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యార్థి పరిషత్ (TGVP) ఆధ్వర్యంలో భిక్కనూర్(Bhikkanoor) మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు గంధం సంజయ్ మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బకాయిలను విడుదల చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎండి సమీర్ ఖాన్, మండల అధ్యక్షుడు భరత్ రాజ్, విజయ్, అంకిత, షిరిన్, మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు