పుస్తకావిష్కరణ
హైదరాబాద్‌లోని చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో ఈ నెల 6వ తేదీ (గురువారం) సాయంత్రం 6 గంటలకు ‘సాహితీకిరణం’ సంపాదకుడు పొత్తూరి సుబ్బారావు రచన ‘ప్రకాశ కిరణాలు’ ఆవిష్కరణ సభ జరుగుతుంది. పుస్తకాన్ని రాష్ట్రప్రభుత్వ పూర్వ సలహాదారు, డాక్టర్ కేవీ రమణాచారి ఆవిష్కరి స్తారు. ఆంధ్రప్రదేశ్ అధికార భా షాసంఘం పూర్వ అధ్యక్షుడు డాక్టర్ పీ విజయబాబు సభకు అధ్యక్షత వహిస్తారు. అతిథులు గా వీఎస్ జనార్దనమూర్తి, డాక్టర్ వంశీ రామరాజు, బెస దేవదాసు,
మౌనశ్రీ మల్లిక్, పెద్దూరి వెంకటదాసు, పొత్తూరి జయలక్ష్మి హాజరవుతారు. రచయిత పొత్తూరి సుబ్బారావు ఈ పుస్తకాన్ని కవి, రచయిత వీఎస్వీ ప్రసాద్‌కు అంకితమివ్వనున్నారు. వీవీఆర్ ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి సాహితీవేత్తలు, కళాకారులు, కళాభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని సంస్థ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి వీవీ రాఘవరెడ్డి విజ్ఞప్తి చేశారు.






