16 April, 2026 | 12:13 AM

కుసుమ గీతం

03-11-2025 12:59 AM

నేను- ప్రేమికుల కానుకను

నేను- పరిణయ శుభవేళ ధరించే హారాన్ని

నేను- సంతోష క్షణాల మధుర జ్ఞాపకాన్ని

నేను- మృతులైన వారికి సంతాప సూచకంగా 

ఇచ్చే సజీవ అంతిమ కానుకను !

నేను- ఆనందంలోనూ భాగాన్నే

మరి, విషాదంలోనూ భాగాన్నే

కానీ, నేను కాంతి దర్శనం కోసం మాత్రమే

పైకి ఉన్నతం వైపుకే చూస్తుంటాను

నా నీడను చూడడానికి

నేనెన్నడూ, ఎప్పుడూ కిందికి చూడను !

ఇది- మనిషి తప్పనిసరిగా

నేర్చుకోవాల్సిన జ్ఞానం !