08-02-2026 07:15:10 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని మోచి సంఘం భవనంలో ఏర్పాటుచేసిన కడారి దశరథ్ విరచిత శ్రీ సంత్ రవి దాసు పుస్తక పరిచయ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పలువురు మెధావులు పాల్గొని సంత్ రవి దాసు చేసిన భక్తి ఉద్యమం గురించి ప్రసంగించారు. సంత్ రవి దాసు ఆనాటి మధ్యయుగలంలో ప్రబలంగా ప్రాకిపోయిన సమాజం రుగ్మతలను రూపు మానడానికి విశేషంగా కృషి చేశారని కొనియాడారు. అనంతరం కవి కడారి దశరథ్ ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కవి కడారి దశరథ్ తో పాటు నిర్మల్ జిల్లా అధ్యక్షులు శ్రీ విద్యా సాగర్.ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, పట్టణ అధ్యక్షులు కావల్ల సాయన్న, కోశాధికారి అల్లకొండ వాశ్వనాథ్ మోచి సంఘం సభ్యులు పాల్గొన్నారు.