calender_icon.png 14 February, 2026 | 4:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేడియో ప్రసారాల పరిణామం పుస్తకావిష్కరణ

14-02-2026 12:12:04 AM

అట్టహాసంగా ఐఐఎంసీ కళాశాల సమావేశపు హాల్‌లో కార్యక్రమ నిర్వహణ

హైదరాబాద్(ఖైరతాబాద్), ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): ఐఐఎంసీ కళాశాల చల్లా సోమ్ రాజ్ రామ్ సభా మందిరంలో తెలుగు శాఖ ఆధ్వర్యంలో వరల్డ్ రేడియో డే సం దర్భంగా డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ ర చించిన ‘రేడియో ప్రసారాల పరిణామం’చారిత్రక, సాంకేతిక, సృజనాత్మక నేపథ్యం పుస్త క ఆవిష్కరణ కార్యక్రమం ఎంతో అట్టహాసంగా జరిగింది. కళాశాల తెలుగు శాఖ అ ధ్యక్షులు ఇ రామకృష్ణ అతిథులను వేదికపైకి ఆహ్వానిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ముఖ్యఅతిథిగా నందివెలుగు ముక్తేశ్వరరావు పుస్తకాన్ని ఆవిష్కరించి తొలి ప్రతిని పి.పూర్ణచందర్రావుకి అందజేశారు. అనంతరం ము క్తేశ్వరరావు మాట్లాడుతూ నాగసూరి రాసిన ఈ పుస్తకం వల్ల రేడియో ప్రసారాల గురించి నేటి యువతకు తెలియని ఎన్నో విషయాలు తెలుస్తాయన్నారు.

సభాధ్యక్షులు వంగపల్లి విశ్వనాథం మాట్లాడుతూ ఆకాశవాణిలో మూడు దశాబ్దాలకు పైగా పలు స్థాయిల్లో, పలు కేంద్రాల్లో రాణించిన వేణుగోపాల్ ర చించిన ఈ పుస్తకం మనదేశంలోని రేడియో కేంద్రాల, కార్యక్రమాల చారిత్రక, సాంకేతిక, సృజనాత్మక పరిణామాలను కరతలామలకంగా వివరిస్తుందన్నారు. ఈ పుస్తకాన్ని ని జాం కళాశాల తెలుగు సహయాచార్యులు డాక్టర్ తిరునగరి శరత్చంద్ర సమీక్షించారు.   

కళాశాల పూర్వ ఆచార్యులు పూర్ణచందర్రావు మాట్లాడుతూ  ప్రధానమంత్రి  మన్ కీ బాత్ కార్యక్రమం మళ్లీ రేడియోకు శ్రోతల సంఖ్య ను పెంచిందన్నారు.   గాంధీ దర్శన్ చైర్మన్ ఆదిత్య మార్గం వరల్డ్ రేడియో డే విశిష్టతను తెలియజేశారు. కళాశాల ఆచార్యులు కూర రఘువీర్ మాట్లాడుతూ ఆకాశవాణి ఎంతో మంది ప్రము ఖు ల వాణిని శ్రోతలకు అందించి రంజింపజేసిందన్నారు.

విశ్రాంత అనౌన్సర్ దక్షిణామూర్తి మాట్లాడుతూ నాగసూరి వద్ద పనిచేస్తున్నప్పుడు తనతో ఉన్న అనుభవాలను తెలుపుతూ ఆకాశవాణిలో ఆయన కొత్త బాటను ఏర్పరచా రన్నారు.  పుస్తక రచయిత, ఆకాశవాణి పూర్వ సంచాలకులు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ మాట్లాడుతూ రేడియో మాధ్యమం అనేది మొదట ఎలా మొదలైంది?  మొదలైన విషయాలను వివరించారు.  కళాశాల చైర్మన్ విశ్వనాథం అతిథులను సత్కరించారు. సం స్కృత అధ్యాపకురాలు మాధవి కార్యక్రమాన్ని వందన సమర్పణతో ముగించారు. కళాశాల డీన్లు డాక్టర్ డి.తిరుమలరావు, డాక్టర్ జి.సంతోషి తదితరులు పాల్గొన్నారు.