7 August, 2026 | 9:33 PM

ఎరువుల యాప్ ద్వారానే బుకింగ్ చేసుకోవాలి

07-08-2026 08:23 PM

- మండల వ్యవసాయ అధికారి సంతోష్

బెజ్జంకి, ఆగస్టు 7(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ఎరువుల యాప్ ద్వారానే యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులను రైతులు బుక్ చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి సంతోష్ సూచించారు. శుక్రవారం బెజ్జంకి మండల కేంద్రంలోని పలు ఎరువుల దుకాణాలను ఆయన తనిఖీ చేసి, ఎరువుల నిల్వలు, విక్రయ విధానాన్ని పరిశీలించారు. 

ఈ సందర్భంగా రైతులకు ఎరువుల యాప్ వినియోగంపై అవగాహన కల్పిస్తూ అవసరమైన ఎరువులను "framework for Fertilizer " యాప్ ద్వారా ముందుగానే బుక్ చేసుకుంటే సకాలంలో సరఫరా పొందవచ్చని తెలిపారు.  రైతులు అధికారిక విధానంలోనే ఎరువులు కొనుగోలు చేసి, రసీదులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.