7 August, 2026 | 9:33 PM

దేశవ్యాప్తంగా జరిగే జైల్ భరోను జయప్రదం చేయండి.

07-08-2026 08:25 PM

మఠంపల్లి: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక,వ్యవసాయ కార్మిక,రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగస్టు 10న జరిగే జైల్ భరో ను విజయవంతం చేయాలని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భూక్య పాండు నాయక్  పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో వ్యవసాయ కూలీ రైతు కార్మికులతో జైల్ భరో కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు,వ్యవసాయ కార్మికులు, కార్మికులు,పేదలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించే విధానాలను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని  పేరు మార్చి వి బి జి రాంజీ పేరుతో కొత్త బిల్లు తీసుకువచ్చిందని ఈ బిల్లు వ్యవసాయ కార్మికులకు తీరని నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఉపాధి కూలీల వేతనాలు విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పోసనబోయిన హుస్సేన్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు బాలు నాయక్, లక్ష్మణ్, ఇంటి రవి, శాంతకుమారి, రాములు, అంజి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.