ఆర్థికాభివృద్ధికి ఊతం
నేడు జాతీయ చిన్నతరహా పరిశ్రమల దినోత్సవం :
అన్ని వర్గాల, ముఖ్యంగా పేద వర్గా ల ప్రజలకు గౌరవ ప్రద పని క ల్పించి , నిరుద్యోగ స మస్యకు కొంత పరిష్కారం చూపి, దేశ ఆర్థికాభివృద్ధికి ఊ తం ఇవ్వ డానికి చిన్న తరహా పరిశ్రమలు ఏ ర్పాటు అవసరం. దీనిని అమలు చేసేం దుకు ప్రభుత్వాలు చొరవ తీసుకుంటున్నాయి. నిజానికి చిన్న తరహా పరిశ్రమలు పేద యువతకు వరం లాంటివి. కేంద్ర ప్రభుత్వం 30 ఆగస్టు, 2000 రోజున చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రణాళికలు ప్రవేశ పెట్టింది.
దీనికి గుర్తుగా ప్రతి ఏట ఆగస్టు 30ని ‘జాతీయ చిన్న తరహా పరిశ్రమల దినోత్సవం’గా పాటిస్తున్నాం. చిన్న తరహా పరిశ్రమల పట్ల ప్రజలకు అవగాహన , అవసర నైపుణ్యాలను పెంపొందించడం, ఆర్థిక చేయూతనివ్వడం, మహిళాశక్తిని బలోపేతం చేయడం, ఉద్యోగ ఉపాధులను కల్పించడం, దేశ ఆర్థిక ప్రగతికి బాటలు వే యడం లాంటి అంశాలను ప్రచారం చేయడానికి ఉపయో గపడతాయి. దేశ సమగ్రాభివృద్ధికి చిన్న తరహా పరిశ్రమలు ఎ ంతగానో దోహదపడుతున్నాయి.
గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేస్తూ, కుటుంబాలకు శ్రేయస్సు క ల్పించడంతో పాటు సమ్మిళిత అభివృద్ధి దిశగా అడుగులు వే యడం జరుగుతోంది. పేద ప్రజలను లేదా యువతను ఎంపిక చే సుకొని వారిని ఔత్సాహిక వేత్తలుగా ప్రోత్సహించడం, ఉద్యోగాల కల్పన, ఆవిష్కరణలకు ప్రాధాన్యమివ్వడం, సమ్మిళిత అభివృద్ధికి దోహదపడటం, ఔత్సాహిక వ్యాపారవేత్తలను శక్తిమంతం చే యడం, స్థానిక హస్తకళలను ప్రోత్సహించడం, భారత సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడం లాంటి లక్ష్యాలతో ఈ దినోత్సవాన్ని ని ర్వహిస్తారు.
చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసి ఖ్యాతి గ డించిన వ్యాపారవేత్తలను గుర్తించడం, లోపాలను లేదా అ వరోధాలను గుర్తించడం, చిన్న పరిశ్రమల శక్తిని వివరించడం లా ంటి అంశాలపై కూడా ఈ వేదికను ఉపయోగించుకుంటారు. నిరుద్యోగ యువతకు అవగాహన కల్పించి, ఆర్థిక సహాయం అందించాలి. పట్టణ, గ్రామీణ ప్రగతిని పరుగులు పెట్టించడం విధిగా జరగాలి. చిన్న పరిశ్రమలతో పెద్ద మార్పులను తీసుకురావాలి. ఊరూ, వాడ, పల్లె, పట్నాలు చిన్న తరహా పరిశ్రమలతో కళకళలాడాలని కోరుకుందాం.
మధుసూదన్ రెడ్డి,కరీంనగర్






