29-08-2025 03:35:03 AM
పల్లె సతీష్ :
విద్య మానవ జీవితానికి వెలుగు. కేవలం అక్షరాలు నేర్చుకోవడం మాత్రమే కాదు, అది ఆలోచనా విధానా న్ని, దృక్పథాన్ని మార్చే శక్తి. విద్య మనిషికి మంచి,చెడుల మధ్య తేడాను గుర్తించే వివేకాన్నిస్తుంది. సమాజంలో గౌరవం, మంచి ఉద్యోగం, ఆర్థిక స్థిరత్వం వంటివి పొందడానికి విద్యే ప్రధాన మార్గం. చదువు ద్వా రా మనం ప్రపంచాన్ని విస్తృతంగా అర్థం చేసుకోగలుగుతాం.
ఇది మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, కొత్త అవకాశా లను సృష్టిస్తుంది. ఒక మనిషి జీవితంలో మార్పు తీసుకురావాలన్నా, ఒక సమాజం అభివృద్ధి చెందాలన్నా, ఒక దేశం ప్రగతి సాధించాలన్నా చదువు చాలా అవసరం. అందుకే చదువును ఎల్లప్పుడూ గౌరవించి, దాని విలువను గుర్తించాలి.
విద్యకు మూలం పుస్తకం. చదువు ద్వా రా మనం పొందే జ్ఞానం, ఆలోచనల వికా సం, దృక్పథంలోని మార్పులకు పుస్తకాలే ప్రధాన సాధనాలు. అవి మనకు కేవలం సమాచారాన్ని మాత్రమే కాకుండా, ప్రపంచంలోని వివిధ సంస్కృతులు, చరిత్రలు, విజ్ఞాన శాస్త్రాల గురించి లోతైన అవగాహ న అందిస్తాయి.
ఒక పుస్తకం మనల్ని సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లి, ఊహించని అనుభవాలను పరిచయం చేస్తుంది. మం చి పుస్తకాలు మనిషిలోని సృజనాత్మకత ను, విమర్శనాత్మక ఆలోచనా శక్తిని పెం పొందిస్తాయి. విద్య ద్వారా మనం సాధించాలనుకునే లక్ష్యాలకు, పుస్తకాలు దారి చూపే దిక్సూచిలా పనిచేస్తాయి. అందుకే, విద్యను గౌరవించినట్లే, దానికి ఆధారం అయిన పుస్తకాలను కూడా మనం అమితంగా ప్రేమించి, చదవాలి.
కొత్త హంగులు జోడించి
విద్యకు మూలమైన పుస్తకాలను ఒకే చోట అందుబాటులో ఉంచే గ్రంథాలయా లు జ్ఞాన కేంద్రాలుగా నిలిచాయి. ఇవి కేవ లం చదువుకునే స్థలాలు మాత్రమే కాకుం డా, సామాజిక మార్పునకు వేదికలు కూ డా. గ్రంథాలయాల్లో సాహిత్యం, చరిత్ర, విజ్ఞాన శాస్త్రం, తత్వశాస్త్రం, కళలు వంటి అనేక రంగాలకు సంబంధించిన వేలాది పుస్తకాలు లభిస్తాయి. వీటితో పాటు, పత్రికలు, జర్నల్స్, నిఘంటువులు, ఎన్‌సైక్లోపీ డియాస్, డిజిటల్ వనరులు కూడా అం దుబాటులో ఉంటాయి. నేటి కాలంలో గ్రంథాలయాలు ఉన్నప్పటికీ వెళ్లి చదువుకునే తీరిక అందరికీ దొరకడం లేదు.
ఉద్యో గ రీత్యా అది సాధ్యపడటం లేదు. కానీ కొందరిలో చదవాలనే తపన ఉంటుంది. అందుకే ఈ సమస్యను గుర్తించి ఓయూకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఆనం దం దుర్గా ప్రసాద్ అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికతను జోడించి ఈఙునలైబ్రరీని తీసుకొచ్చారు.
ఆన్‌లైన్ గ్రంథా లయాల ఏర్పాటు అనేది నేటి సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్న ఆయన ఒక అద్భుతమైన పరిష్కారాన్ని అందించా రు. ‘ఈ తెలంగాణ’ అనే పేరుతో ఒక ఆన్‌లైన్ గ్రంథాలయాన్ని ప్రారంభించారు. పాఠకులను, విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఈ--లైబ్రరీ తెలంగాణ వెబ్‌సైట్‌ను.. ‘అందరికీ విద్య, ఉద్యోగ అవకాశాల సమాచారం’ అనే నినాదంతో దుర్గా ప్ర సాద్ దీనిని రూపొందించి చదువుకునే సు లువైన మార్గానికి తెర తీశారు.
ఈఙులైబ్రరీ ఆద్యుడు
పుస్తకం నేర్పే విజ్ఞానంతో ప్రపంచాన్ని జయించొచ్చు అని బలంగా నమ్మిన వ్యక్తి ఆనందం దుర్గాప్రసాద్. నిరంతరం ఏదో సాధించాలనే తపనతో తన జీవన ప్రయా ణం ఆరంభమైంది. సూర్యాపేట జిల్లాలోని నేరేడుచర్ల మండలం.. జానలదిన్నె అనే మారుమూల గ్రామంలో పుట్టిన దుర్గాప్రసాద్ ఎంతో కష్టపడి చదువుకున్నారు. అనంతరం డిగ్రీ కళాశాలలో లైబ్రేరియన్‌గా ఉద్యోగాన్ని సాధించారు.
ఇక ఉస్మా నియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టాను అందుకున్న దుర్గా ప్రసాద్ దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో నిర్వ హించిన జాతీయ సెమినార్లలో పరిశోధన పత్రాలను సమర్పించి ప్రశంసలు అందుకున్నారు. దుర్గా ప్రసాద్ చేస్తున్న నిస్వార్ధ కృషిని తెలంగాణ ప్రభుత్వం గుర్తించి తెలంగాణ స్టేట్ లెవెల్ బెస్ట్ లైబ్రేరియన్ పురస్కారాన్ని మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా అందుకున్నారు.
తాను చదువుకుంటున్న రోజుల్లో పుస్తకాల కోసం పడిన ఇబ్బందులు, ఉద్యోగ సమాచారం తొందరగా తెలియక మారుమూల ప్రాంతాల్లో సరైన సమాచారం అందక తాను పడిన ఇబ్బంది.. భవిష్యత్తులో ఏ ఒక్క విద్యార్ధి ఎదుర్కోకూడదని భావించారు. ఈ తరుణంలోనే తన మదిలో ఉద్భవించిన ఒక సాంకేతిక విప్లవమే ఈ- లైబ్రరీ తెలంగాణ.
ప్రధాన ఉద్దేశం అదే..
విద్యార్థుల భవితవ్యాన్ని తీర్చిదిద్దాలని విద్యార్థులకు తాజా సమాచారాన్ని పైసా ఖర్చు లేకుండా అరచేతిలోకి అందివ్వాలనే ఆలోచన నుంచి ఆవిష్కృతమైంది ఈ -లైబ్రరీ తెలంగాణ. ఈ రోజుల్లో తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు ఎంత అవసరమో అంతకు మిం చిన అత్యవసర వస్తువుగా స్మార్ట్ ఫోన్ తన స్థానాన్ని అంతగా స్థిరపర్చుకుంది. మాన వ జీవితంలో మొబైల్ ఫోన్ లేకుండా ఒక్కరోజు కూడా గడపలేక పోతారు.
ఈ ఆలో చనతోనే దుర్గాప్రసాద్ విద్యార్థులకు ఎం తో విలువైన సమాచారాన్ని వారి అరిచేతిలోకి వచ్చి వాలిపోయేలా ఈ -లైబ్రరీ తెలం గాణను తీర్చిదిద్దారు. ఈ లైబ్రరీ తెలంగాణ వెబ్‌సైట్ ద్వారా ఇప్పటివరకు 153 దేశాల (అమెరికా, బ్రిటన్, జపాన్, రష్యా, సింగపూర్) విద్యార్థులు, విద్యావేత్తలు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు దీనిని వినియోగించుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వెబ్‌సైట్ 9,52,742 మం ది పేజీ వీక్షకులను కలిగి ఉంది. ఇంతటి ఘనత సాధించడం మన తెలంగాణకు గర్వకారణం.
ఏమిటీ ఈ లైబ్రరీ?
గ్రామస్థాయి నుంచి ప్రపంచస్థాయిలో జరిగే ఏ విషయమైనా కరెంట్ అఫైర్స్ రూపంలో తెలుసుకోవచ్చు. రాష్ర్ట ప్రభు త్వం, కేంద్ర ప్రభుత్వాలు విడుదల చేసే పలు రకాల నోటిఫికేషన్‌లకు సంబంధించిన పూర్తి సమాచారంతో పాటు వెబ్‌సైట్ లింకులను కూడా పొందుపరిచారు. పలు రకాల ఉద్యోగ నియామక పరీక్షలు, వివిధ విశ్వవిద్యాలయాలు నిర్వహించే పీజీ, పీహెచ్‌డీ పరీక్షలకు సంబంధించిన గత ప్రశ్నా పత్రాలు అన్నింటిని అందుబాటులోకి తె చ్చారు.
స్టడీ మెటీరియల్‌ను, అలాగే ఉద్యోగాల కోసం అర్జీలు పెట్టుకోవడానికి పలు రకాల వెబ్‌సైట్లలో లింకులను ఈ లైబ్రరీ తెలంగాణాలో పొందుపరిచారు. ఈ లైబ్ర రీ తెలంగాణ నుంచి ముఖ్యమైన సమాచారం ఏదైనా ఉంటే పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం కల్పించారు.
తాను గ్రంధ పాలకుడిగా ఉంటూనే నిరంతరము విద్యార్థులకు చదువుకోవడానికి గ్రంథాలయంలో పలు రకాల ఉద్యో గాల కోసం పోటీపడే అభ్యర్థులకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచ డమే కాకుండా వాటిని ఎలా చదవాలి, ఎ లా గుర్తు పెట్టుకోవాలి లాంటి సలహాలను విద్యార్థులకు అందిస్తారు.
తాను బోధిస్తున్న కళాశాలలో పలు రకాల ఉద్యోగా లకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడమే కాకుండా, ఒత్తిడికి గురైన విద్యార్థులకు తగిన మానసిక సామర్థ్యాలని నిర్మించుకునే విధంగా సూచనలు, సలహాలు ఇస్తారు. కరెంట్ అఫైర్స్, ప్రభుత్వ నోటిఫికేషన్లు, గత ప్రశ్నా పత్రాలు, స్టడీ మెటీరియల్స్ వంటి విలువైన సమాచారాన్ని ఒకే చోట అందు బాటులో ఉంచి, విద్యార్థులు, ఉద్యోగార్థు లు తమ లక్ష్యాలను చేరుకోవడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది.
డిజిటల్ యుగంలో విద్యార్థులు చదువుకోడానికి సులువుగా ఏర్పాటు చేసిన ఈ లైబ్రరీ తె లంగాణను అందరూ అభినందిస్తున్నారు. ఏర్పాటును అ ం ద రూ కేవలం సమాచారాన్ని అందించడమే కాకుండా, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి అవసరమైన మార్గదర్శనం, ఒత్తిడిని అధిగమించడానికి సలహాలు ఇవ్వడం ద్వారా ఇది ఒక సమగ్రమైన విద్యా వనరుగా నిలుస్తుంది. తెలం గాణలోని విద్యార్థుల డిజిటల్ అక్షరాస్యతను పెంచే దిశగా ఒక గొప్ప డిజిటల్ విప్ల వంలా మారుతోంది ఈ లైబ్రరీ తెలంగాణ.
వ్యాసకర్త సెల్: 9010953659