09-12-2025 12:00:00 AM
ఘట్ కేసర్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): అనురాగ్ హాకోరియో మరియు సీఎస్‌ఐసీఎస్‌ఈ విభాగం ఆధ్వర్యంలో అనురాగ్ యూనివర్సిటీ విజయ వంతంగా టెక్ హక్ బూట్క్యాంప్ను సోమవారం నిర్వహించింది. రాబోయే 36 గం టల హాకథాన్ను దృష్టిలో ఉంచుకొని విద్యార్థులను సిద్ధం చేయడానికి రూపొందించిన ఈ ప్రీ-హాకథాన్ శిక్షణ కార్యక్ర మం, పలు సాంకేతిక రంగాలలో ప్రాక్టికల్ అవగాహన కల్పించే వేదికగా నిలిచింది.
ఈ బూట్క్యాంప్, బ్లాక్చైన్, యాప్ డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్, డెవ్‌ఒప్స్, గేమ్ డెవలప్మెంట్ తదితర పలు విభాగాలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేసింది. ఈ బూట్క్యాంప్లో మొత్తం 750 మంది విద్యార్థులు, 250 బృందాలుగా పాల్గొని విశేష స్పందనను అందించారు. విద్యార్థులు తమ ఫండమెంటల్స్ను బలోపేతం చేసుకోవడం, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లను అర్థం చేసుకోవడం, టూల్-బేస్డ్ ట్రైనింగ్ పొందడం, హాకథాన్ సమయంలో అవసరమయ్యే సమస్య పరిష్కార నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడం వంటి లక్ష్యాలతో చేరుకున్నారు.
అనురాగ్ యూనివర్సిటీ, హాకోరియో సీఎస్‌ఐసీఎస్‌ఈ విభాగం తరపున ఈకార్యక్రమానికి నిరంతర సహకారం అందించిన యూనివర్సిటీ మేనేజ్మెంట్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. డీన్ లు డాక్టర్ వి. విజయకుమార్, డాక్టర్ జి. విష్ణుమూర్తి, అలాగే ఆహ్వానిత అతిథులు, మెంటర్లు విద్యార్థులను అభినందించి ప్రోత్సహించారు. ఫ్యాకల్టీ కన్వీనర్లు డాక్టర్ బి. రవీందర్ రెడ్డి, డాక్టర్ పి. రాజశేఖర్ రెడ్డి, డాక్టర్ జీ. బాలరాం, కో-కన్వీనర్లు డాక్టర్ తరణాసింగ్, అమితా మిశ్రా పాల్గొన్నారు.